కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
రాంగోపాల్ పేట్ డివిజన్‌లో పర్యటన
వతెలంగాణ-బేగంపేట్
రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో రైల్వే సంబంధిత సమస్యలు ఉన్న ప్రాంతాలతో పాటు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ మేరకు రాంగోపాల్ పేట పరిధిలో ఉన్న స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే, జీహెచ్ ఎంసీ అధికారుల సమన్వయంతో వాటి పరిష్కారానికి కషి చేయాలని తెలిపారు. రైల్వే ట్రాక్, రైల్వే బ్రిడ్జ్‌ల కింద ఉన్న సమస్యలకు సంబంధించి పనులను వేగవంతం చేశామ న్నారు. స్థానికంగా ఉండే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొం టున్న నేపథ్యంలో రైల్వే, మున్సిపల్ అధికారుల సమన్వ యంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తన దృష్టికి తెచ్చిన పలు రైల్వే సంబంధిత సమస్యలను, జరుగుతున్న పనులను అధికా రులతో కలిసి పరిశీలించామని, అధికారులకు దిశా నిర్దేశం చేశామని తెలిపారు. హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా మెల గాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసు కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా కొన్ని కఠినమైన చట్టాలు తీసుకరావాలని కోరారు.ప్రభుత్వం కొత్త లేఅవుట్ లు చేసేటప్పుడు పిల్లలకు ఆటస్థలాలు తప్పనిసరి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జంట నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయిన వేళా పచ్చదనం పరిశుభ్రత బాధ్యత ప్రభుత్వాలదే అని వదిలేయకుండా సామజిక బాధ్యతతో ప్రజలు వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీర సుచిత్ర శ్రీకాంత్, కొంతం దీపిక నరేష్, రైల్వే అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, బీజేపీ స్థానిక నాయకులు ఆకుల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.