– గుర్తు తెలియని 28 మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి
భువనేశ్వర్ : సుమారు నాలుగు క్రితం ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించిన 28 మంది గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలకు బుధవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన ఈ దహన ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ముగిసిందని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సులోచన దాస్ తెలిపారు. సుమారు నాలుగు నెలలుగా భద్రపర్చబడిన మృతదేహాలు మంచుగా మారాయని, భరత్‌పూర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. మృతదేహాల డిఎన్‌ఎను భద్రపర్చినట్లు తెలిపారు. ఒడిషాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో 297 మంది మృతి చెందారు.