– ఎంపీపీ విజయకుమార్
గట్టు: అధికారులు అందుబాటులో ఉండాలని ఎంపీపీ విజయకుమార్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ విజరు కుమార్ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. విద్య పై ఎంఈఓ కొండారెడ్డి మాట్లాడుతూ నవంబర్ ఒకటవ తేదీ నుంచి సీఎం బ్రేక్ ఫాస్ట్ సెంటర్‌ను మాచర్ల బలిగారా బస్వాపురం గొర్లఖాన్దొడ్డి గ్రామాలలోని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పాఠశాలలోని సక్సెస్ అయితే మిగతా పాఠశాల కూడా ప్రారంభిస్తారని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీిహెచ్‌ఓ హుస్సేన్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం ఆరు పడకల గది ఉందని, దానిని 30 పడకలను చేస్తే రోగులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. సాధారణ ప్రసవాలు జరుగుతాయన్నారు. అంతే కాకుండా హాస్పిటల్ లో రెగ్యులర్ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఎంపీపీ విజయకుమార్ మాట్లాడుతూ గ్రామాలలోని పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలన్నారు. ఎలక్షన్ టైం లో పనులు కూడా అధికారులే చేయాలన్నారు. గ్రామాల్లోని నీరు, విద్యుత్, డ్రైనేజీ సమస్యలను చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యద ర్శులపై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలోని వైస్ ఎంపీ మేకల సుమతి రామాంజనేయులు , ఎంపీడీవో చెన్నయ్య , వివిధ గ్రామాల చెట్టు ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.