అభ్యంతరం చెప్పినా.. అధికారులు దృవీకరిస్తున్నారు

– తహసీల్ వద్ద స్థానికుడు ఉప్పులేటీ బాబు నిరసన

– జీవో 58,59 అక్రమార్కులకు వరంగా మారిందని ఆరోపణ 
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగుబలహీన వర్గాల ప్రజల కోసం తీసుకువచ్చిన జీవో 58,59 అక్రమార్కులకు వరంగా మారిందని..దరఖాస్తులదారులు సమర్పించిన దరఖాస్తులపై పలువురు అభ్యంతరం చేప్పినా.. పట్టించుకోకుడా దృవీకరిస్తున్నారని స్థానికుడు ఉప్పులేటీ బాబు ఆరోపించారు.గురువారం మండల కేంద్రంలోని తహసీల్ వద్ద అధికారుల తీరుపై ఉప్పులేటీ బాబు అభ్యంతర దరఖాస్తుతో నిరసన తెలిపారు.మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను అక్రమించి ఇండ్ల నిర్మాణాలు చేపట్టి, పట్టాలు చేసుకుంటున్న అక్రమార్కులకు అధికారులు అండగా నిలుస్తున్నారని సంబంధిత జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి జోవో 58,59 యందు దరఖాస్తులు చేసుకున్న దరఖాస్తులదారులు, అధికారుల అండతో పట్టాలు చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని బాబు విజ్ఞప్తి చేశారు.