232 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్న ఆబ్కారీ శాఖ అధికారులు

నవతెలంగాణ, గాంధారి

గాంధారి మందలంలోని సోమారం గ్రామ పంచాయతీ పరిధిలోని అవుసులకుంట తాండాలో ఈ రోజు అబ్కారీ శాఖ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ బృందం పక్కా సమాచారం మేరకు దాడి చేసి 232 గంజాయి మొక్కలను, (దాదాపు 25 లక్షల రూపాయల)  స్వాధీనం చేసుకోవడం జరిగింది. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.రవీందర్ రాజు తెలిపారు. తండాకు చెందిన గిరిజన వ్యక్తి దనవత్ జైత్రాం అంతర్ పంటగా పండిస్తున్నట్లు తెలిసింది. టాస్క్ ఫోర్స్ దాడిలో జైత్రాం అందుబాటులో లేక పోవడంతో స్థానిక తహశీల్దార్ కు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. త్వరలోనే పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతోందని సూపరింటెండెంట్ తెలిపారు.  ఎన్నికలు జరగనున్న సందర్భంగా  డబ్బు, మద్యం, గంజాయి లాంటి తదితర మత్తు పదార్థాల రవాణా జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దాడులు నిర్వహించి గంజాయి మొక్కలు పట్టు కోవడం జరిగింది. యువత మత్తు మందుకు లోను కాకుండా ఉండే కోసం గాంధారి మండలాన్ని గంజాయి ఫ్రీగా మార్చడమే లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ దాడిలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీఐ ఎస్. సుందర్ సింగ్, ఎస్ఐ మమత, స్థానిక సీఐ ఎండి. షాఖీర్ అహ్మద్, ఎస్ఐ జలాలుద్దిన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు