అధికారులు నిజ నిజాలు తెలుసుకొని రావాలి..

– సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్యాల గోవర్ధన్
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజాంబాద్ నగరంలోని రూరల్ పోలీసులు అధికారులు నిజా నిజాలు తెలుసుకొని స్థలాల వద్దకు రావాలని భూ పోరాటం చేస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నానని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్యాల గోవర్ధన్ శనివారం ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో సిపిఎం ఆధ్వర్యంలో భూ పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో నిజామాబాద్ నగరంలో దుబ్బ ప్రాంతంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూ పోరాట కేంద్రం వద్దకు పోలీసులు వచ్చి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలికే పద్ధతుల్లో వ్యవహరిస్తూ, గుడిసెలు వేసుకున్న ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ, గుడిసెలు ఖాళీ చేయాలని రూరల్ ఎస్హెచ్ఓ వ్యవహరించడం సరికాదని అన్నారు. అధికారులు నిజానిజాలు తెలుసుకొని రావాలని అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గా సభ్యులు మల్యాల గోవర్ధన్ సంబంధిత అధికారులపై మండిపడ్డారు. భయభ్రాంతులకు గురి చేస్తే ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.