– జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి
నవతెలంగాణ – ములుగు
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహిం చేందుకు ఎన్నికలు కమిషన్ నిబంధనలు అధికారులు తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి ఎన్నికల నిర్వహణ పై ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికా రులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబం ధించి ఎలాంటి పొరపాట్లు జరుగకుండా, ఇబ్బందులూ లేకుండా సజావుగా ఎన్నికలు జరిగేందుకు పోలింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. అందుకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు సమ కూర్చుకోవాలన్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు పోలింగ్ సామాగ్రి తీసుకున్న తర్వాత పోలింగ్ కేంద్రంలో కావలసిన ఏర్పాట్లను అన్ని పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండాలని అన్నారు. 13 రకాల అత్యవసర సేవల రంగాలకు చెందిన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించినట్లు తెలిపారు. నవంబర్ 9 నుంచి నవంబర్ 30 మధ్యలో రెండోసారి, డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5 మధ్యలో మూడోసారి ఎన్నికల పరిశీలకుల పర్యటన ఉంటుందని తెలిపారు. ఎన్నికల విభాగం అధి కారులు, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
యువతకు ప్రేరణగా నిలవాలి
దివ్యాంగులు వయోవద్ధులు ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి అన్నారు. మంగళ వారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో 2023 అసెంబ్లీ ఎన్నికలు, స్వీప్ కార్యక్రమములో భాగంగా దివ్యాంగులు, వయోవద్ధులకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి అవగాహన కార్య్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వయోవద్ధులతో మాట్లాడుతూ 80 ఏళ్ల వయసు పైబడిన వద్ధులు, పోలింగ్ స్టేషన్ వరకు వెళ్లలేని దివ్యాంగుల కోసం ఎన్నికల కమిషన్ ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకునే వీలు కల్పిం చిందని చెప్పారు. అందుకు అర్హత ఉన్న వారంతా 12 డి ఫారం నింపాలని తెలిపారు. ఇందుకు ప్రభుత్వ అధికారులు, బిఎల్వోలు సహకరిస్తారని తెలిపారు. జిల్లా లో ఉన్న ఓటర్లు తప్పక ఓటు హక్కు వినియోగిం చుకునేలా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికా రులను ఆదేశించారు. దివ్యాంగులు, వయోవద్ధులు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకుని తద్వారా మిగతా ఓటర్లకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ప్రభుత్వం కల్పించిన ఓటు హక్కును బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద వయోవృద్ధులు, వికలాంగుల కోసం తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎటువంటి అసౌకర్యం లేకుండా ఓటు హక్కు వినియోగించు కోవచ్చని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, డిపిఓ వెంకయ్య, సిడిపిఓ స్వాతి, తదితరులు పాల్గొన్నారు.