పాత డిమాండ్లు నెరవేర్చాలి

– లేకపోతే మండి వ్యవస్థను పునరుద్ధరించడానికి పెద్ద ఎత్తున ఆందోళనలు : బీహార్‌ సర్కారును హెచ్చరించిన రాకేశ్‌ టికాయత్‌ టికైత్‌
పాట్నా: నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వాన్ని భారతీయ కిసాన్‌ యయూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ హెచ్చరించారు. పాత డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైతే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మండి వ్యవస్థను పునరుద్ధరించాలని బీహార్‌లో కష్టాల్లో ఉన్న రైతులు పెద్ద ఆందోళనకు దిగుతారని వెల్లడించారు. 2006లో నితీశ్‌ కుమార్‌ నేతత్వంలోని ఎన్డీయే సర్కారు వ్యవసాయ సంస్కరణల పేరుతో అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెటింగ్‌ కమిటీ (ఏపీఎంసీ) చట్టాన్ని రద్దు చేసింది. దీని ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తుల కోసం నియంత్రిత హౌల్‌సేల్‌ మార్కెట్‌ మూసివేయబడింది. సాధారణంగా వీటిని మండీ లు అని పిలుస్తారు. ప్రభుత్వం మండీలను నియంత్రిస్తుంది. ఇది ప్రయివేటు సంస్థలు రైతుల నుంచి నేరుగా వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేసేలా చేసింది. కైమూర్‌ జిల్లాలోని భబువాలోని కిసాన్‌ మహాపంచాయత్‌లో రైతులను ఉద్దేశించి టికాయత్‌ మాట్లాడుతూ.. రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు మండి వ్యవస్థ పునరుద్ధరణ కోసం రైతులు ఆందోళనలు చేపడతారని బీహార్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ”ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తూ, మండీలను పునరుద్ధరించాలనే వారి డిమాండ్‌ను విస్మరిస్తే, రైతులు ఆందోళనకు దిగవలసి వస్తుంది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న రైతు నాయకులు పాల్గొంటారు” అని రాకేశ్‌ టికాయత్‌ అన్నారు. నితీశ్‌ ప్రతిపక్ష కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థి కావాలనుకుంటే, అతను మండీలు, బజార్‌ సమితుల పునరుద్ధరణకు వెళ్లాలని తెలిపారు.