12న చలో హైదరాబాద్ కరపత్రాలు ఆవిష్కరణ

నవతెలంగాణ- గాంధారి
ఆగస్టు 12వ తారీకు శనివారం నాడు టి ఎస్ సిపిఎస్ ఈయు  ఆధ్వర్యంలో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక  సమావేశం ఈరోజు గాంధారి ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది.ఈసందర్భంగా  జిల్లా అధ్యక్షులు కుంట ఎల్లారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమస్యల పరిష్కరనికి ఈనెల12 తేదీన నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమంలో అందరూ పాల్గొని సభను విజయవంతంచేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాప్రధాన కార్యదర్శి బాణాల భాస్కర్ రెడ్డి ,జిల్లా కోశాధికారి లింగం,జిల్లా  ఉప అధ్యక్షులు విట్టల్ యాదవ్ , మోహన్, స్థానిక పాఠశాల హెచ్ఎం రంగా వెంకటేశ్వర్ గౌడ్ , మండల ప్రధాన కార్యదర్శి చిరంజీవి, పిఆర్ టియు  మండల అధ్యక్షుడు ప్రకాష్ , ప్రధాన కార్యదర్శి గంగాధర్ , కార్యవర్గ సభ్యులు నవీన్ శ్రీనివాస్ మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయ పాల్గొన్నారు.