24న చలో విద్యుత్‌ సౌధ జయప్రదం చేయండి

– విద్యుత్‌ ఉద్యోగుల పీఆర్సీ, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి : టీఎస్‌పీఈజేఏసీ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్‌ ఉద్యోగుల పీఆర్సీ, ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌లోకి మార్పుతో పాటు ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 24న చలో విద్యుత్‌ సౌధ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నట్టు తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీఎస్‌పీ ఈజేఏసీ) పిలుపునిచ్చింది. విద్యుత్‌ ఉద్యో గులు ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరింది. శని వారంనాడిక్కడి టీఎస్‌ఆర్టీసీ కళ్యాణ మండపంలో టీఎస్‌పీఈజేఏసీలోని కార్మిక, ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశం జరి గింది. పెద్ద ఎత్తున విద్యుత్‌ ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జేఏసీ చైర్మెన్‌ సాయిబాబు, కన్వీనర్‌ రత్నాకర్‌ రావు, కో చైర్మెన్‌ శ్రీధర్‌, కో కన్వీనర్‌ బీసీ రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ గోవర్థన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 ఏప్రిల్‌ 1 నుంచి వేతన సవరణ ఇవ్వాలని యాజమాన్యానికి నోటీసు ఇచ్చామనీ, దానికి అనుగుణంగానే ఆందోళనలకూ పిలుపు ఇచ్చామన్నారు. అయితే పలు మార్లు యాజమాన్యం చర్చలకు ఆహ్వానించినా, అవి ఓ కొలిక్కి రాలేదనీ, మరికొంత గడువు కావాలని యాజ మాన్యం కోరడంతో తమ ఆందోళనలను వాయిదా వేసుకున్నామని వివరించారు. అయితే మార్చి 24న చలో విద్యుత్‌సౌధ ఆందోళనను జరుపుతామని ముందుగానే చెప్పామని తెలిపారు. దాన్ని జయప్రదం చేయడం కోసం 18వ తేదీ హైదరా బాద్‌లో, 20న వరంగల్‌, 21న పాల్వంచలో సన్నాహక సమావేశాలు జరపాలని నిర్ణయించామన్నారు. దానిలో భాగంగానే శనివారం సమావేశం నిర్వ హించినట్టు వివరించారు. పెన్షనర్లు, ఆర్టిజన్లకూ వేతన సవరణ జరగాలని కోరారు. సన్నాహక సమావేశాలను జయప్రదం చేస్తూ, 24న జరిగే ‘చలో విద్యుత్‌ సౌధ’లోపెద్ద సంఖ్యలో విద్యుత్‌ ఉద్యోగులు, ఆర్టిజన్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ వైస్‌ చైర్మెన్‌ అనీల్‌, వజీర్‌, జాయింట్‌ సెక్రటరీలు శ్యామ్‌ మనోహర్‌, వెంక్కన్న గౌడ్‌, సుధాకర్‌రెడ్డి, ఫైనాన్స్‌ సెక్రటరీ కరుణాకర్‌ రెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు నారాయణ్‌ నాయక్‌, నాగరాజు, మోజెస్‌, శ్రీనివాస్‌, నితిన్‌ కుమార్‌, అరవింద్‌ కుమార్‌, రవీందర్‌, వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌, సదానందం, శ్రీనివాస్‌, పివి రావు తదితరులు పాల్గొన్నారు.