ఢిల్లీలో ఓబీసీ రిజర్వేషన్లపై

On OBC reservation in Delhi– భారతీయ ఓబీసీ సమాఖ్య వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
భారతీయ ఓబీసీ సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం నాడిక్కడ వివిధ పార్టీల ప్రతినిధులను కలిసి ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, చట్టసభలలో 27 శాతం రిజర్వేషన్లపై వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా సాధికారత సామాజిక న్యాయశాఖ కేంద్రమంత్రి రాందాస్‌ అత్వాలేను ఓబీసీ సమస్యలపై మద్దతు కోరారు. స్పందించిన మంత్రి పార్లమెంట్లో ఓబీసీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం భారతీయ ఓబీసీ సమాఖ్య పోస్టర్‌ ఆవిష్కరించిన కేంద్రమంత్రి భారతీయ ఓబీసీ సమాఖ్య నిర్వహించే కార్యక్రమాలకు రిపబ్లిక్‌ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బీసీ జాతీయ కమిషన్‌ చైర్మెన్‌ హన్స్‌ రాజ్‌ గంగారామ్‌ అహిర్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు తారిఫ్‌ అన్వర్‌, ఏఐసీసీ కార్యాల యంలో తెలంగాణ ఇంచార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో ఓబిసి నేతలు భేటీ అయ్యారు.