ఈ నెల 10న అంబేద్కర్ జీవిత డ్రామా ప్రదర్శన: ఎ.ఎస్.డబ్ల్యు.ఒ

నవతెలంగాణ – అశ్వారావుపేట
భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ జీవిత డ్రామా ను ప్రతీ నియోజక వర్గం కేంద్రంలో ప్రదర్శించాలని సాంఘీక సంక్షేమ శాఖ నిర్ణయించిందని పాల్వంచ సహాయ సాంఘీక సంక్షేమ అధికారి శివ భాస్కర్ శుక్రవారం  తెలిపారు. హైద్రాబాద్ కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ వారిచే ప్రదర్శించే ఈ డ్రామాను నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో పదో తేదీ ఆదివారం స్థానిక గిరిజన భవన్ లో సాయంత్రం 6 గంటలకు ప్రదర్శిస్తారని ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజక వర్గం కేంద్రాలలో ఏడో తేదీ గురువారం ఇల్లందు,ఎనిమిదో తేదీ శుక్రవారం జిల్లా కేంద్రం అయిన కొత్తగూడెం, తొమ్మిదో తేదీ శనివారం పినపాక,పదో తేదీ ఆదివారం అశ్వారావుపేట,పదకొండో తేదీ సోమవారం భద్రాచలం పట్టణాల్లో ప్రదర్శించబడుతుంది అని ఆయన తెలిపారు. ప్రజా ప్రతినిధులు,రాజకీయ నాయకులు,అధికారులు,అంబేద్కర్ వాదులు,విద్యార్ధిని విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.