18న ముదిరాజ్‌ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలి

18న ముదిరాజ్‌ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలినవతెలంగాణ-జోగిపేట
ఈ నెల 18వ తేదీన జరిగే ముదిరాజ్‌ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ముదిరాజ్‌ మహాసభ ఉపాధ్యక్షులు పి.నారాయణ కోరారు. గురువారం అందోల్‌ మండల పరిధిలోని మసానిపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అందోల్‌ నియోజకవర్గంలోని 9 మండలాల ముదిరాజ్‌ బందువులు హాజరవు తున్నారన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌, సినీ హీరో బిత్తిరి సత్తి, ఫిషరిష్‌ రాష్ట్ర అధ్యక్షులు పిట్టల రవీందర్‌ పాల్గొంటున్నారన్నారు. స్థానిక క్లాక్‌ టవర్‌ నుంచి ర్యాలీగా బయలుదేరి శ్రీరామ ఫంక్షన్‌ హాల్‌లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ముదిరాజులకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తు న్నాయని, ఈ విషయంలో సిట్టింగ్లకు ఖరారు చేయడంతో అవకాశం దక్కలే దన్నారు. రాష్ట్ర ముఖ్య నాయకులు ఇటీవల సీఎం కేసీఆర్‌తో మాట్లాడా రని చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చారన్నారు. సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని, రాబోవు బహి రంగ సభల్లో అంశాలపై ప్రసంగిస్తారని తెలిపారు. ముదిరాజ్‌ మహాసభ నియోజకవర్గ నాయకులు డిబి నాగభూషణం, మండల అధ్యక్షులు తెనుగు గంగాధర్‌, నాయకులు మల్లేశం, శ్రిను, బాగయ్య, శంకరయ్య, నవీన్‌, సాయి పాల్గొన్నారు.