కవితకు మరోసారి ఈడీ నోటీసు

– నేడు విచారణకు రావాలని పిలుపు
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు మరోసారి చర్చనీయాంశమవుతోంది. గత కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న ఈ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట కవితకు తాజాగా ఈడీ నోటీసు జారీ చేసింది. నేడు (శుక్రవారం) విచారణకు హాజరుకావాలంటూ నోటీసులో పేర్కొంది. కవితను అరెస్టు చేస్తారని గతంలోనే వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేమీ రగలేదు. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇది బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని ఆరోపణలకు తావిచ్చింది. ఇలాంటి తరుణంలో ఉన్నట్టుండి కవితకు నోటీసులు ఇవ్వడం మరోసారి చర్చకు దారి తీసింది. సౌత్‌ గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా అఫ్రూవర్లుగా మారిపోయారు. దీంతో ఈ కేసు మళ్లీ మొదటికొచ్చింది. ఇందులో భాగంగానే కవితకు ఈడీ మళ్లీ నోటీసులు ఇచ్చిందన్న చర్చ నడుస్తున్నది. తాజాగా మరోసారి ఈడీ నోటీసు ఇవ్వడంతో కవిత అరెస్టుపైనా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.