మరోమారు హాక్‌థాన్‌లో సత్తా చాటిన ఎస్సార్‌ విద్యార్థులు

నవతెలంగాణ-హసన్‌పర్తి
మండలంలోని అనంతసాగర్‌ ఎస్సార్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు హాక్‌థాన్‌లో మరోసారి తమ సత్తా చాటుకొని విజ్ఞాన రంగానికే సవాల్‌గా నిలిచారని ఎస్సార్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ దీపక్‌ గార్గ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ విజ్ఞాన రంగంలో సాంకేతిక కోడింగ్‌ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు. ఎన్నో అవకాశాలు అందుకోగల ప్రాముఖ్యత విద్యార్థులకు అందిస్తూ ఎస్సార్‌ విశ్వవిద్యాలయాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబడడానికి దోహదపడేవిధంగా హాక్‌థాన్‌ దిక్సూచిగా ఉంటుందన్నారు. ఇందులో భాగంగా దాదాపు 900 మంది విద్యార్థులు తృతీయ సంవత్సరం విద్యార్థులకు వారిలో సాంకేతిక పరిజ్ఞాన పటిమను పరీక్షించే హాక్‌థాన్‌ కార్యక్రమం నగరంలో నైపుణ్యతను కలిగిన విద్యను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్‌ విశ్వవిద్యాలయం సీఎస్సీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ శశికళ, డాక్టర్‌ సురేష్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు రవికుమార్‌, రవిచైతన్య, తదితరులు పాల్గొన్నారు.