కేరళ : కేరళ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం మరోసారి కక్ష కట్టింది. రాష్ట్రానికి రావాల్సిన సమీకృత వస్తువులు మరియు సేవల పన్ను (ఐజీఎస్టీ) సెటిల్‌మెంట్ నుంచి రూ.332 కోట్లు కేంద్రం కోత విధించింది. కేంద్రం తీరుపై కేరళ ప్రభుత్వం ఆగ్రహించింది. ఈ కోతతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజార్చుతుందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్.బాలగోపాల్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఆర్ధిక మంత్రికి లేఖ రాశారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న హేతుబద్ధతను వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.