బైక్ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ-శంకరపట్నం : బైకు ఢీకొని  ఒకరికి గాయాలైన ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండల కేంద్రంలోని అంబాలాపూర్ గ్రామానికి చెందిన రానివేని శంకర్ (65) బుధవారం కెశవపట్నం పాత బస్టాండ్ సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా, ఎదురుగా వస్తున్నటువంటి బైక్ ఢీకొనడంతో శంకర్,తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 ఫోన్ చేయడంతో  సిబ్బంది ఈఎంటి  సతీష్ రెడ్డి, పైలట్ ఖాజా ఖలీల్ల్లాలు, సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని అంబులెన్స్ లోకి తీసుకొని ప్రథమ చికిత్స అందిస్తూ కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు, తరలించినట్లు, అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది