రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-వీణవంక
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాయ్యాయి ఈ సంఘటన మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులోని సబ్ స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం జమ్మికుంటకు చెందిన కాయిత శ్రీనివాస్ వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి జమ్మికుంటకు బైకుపై వెళ్తున్నాడు. కాగా పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులోని సబ్ స్టేషన్ సమీపంలో కారు ఢీకొనగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న బంధువులు ఘటానాస్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం జమ్మికుంటకు తరలించారు.