పాటొక్కటే…

ఏమనుకున్నా అనుకోకపోయినా
దేహం మట్టిలోకి ఇంకిపోయింది

దుఃఖం మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది
పాట అజరామరమయింది

తనొక్కడే జనం మధ్యలోంచి
కదలి వెడలి పోయాడు

అలుపెరుగని గజ్జెలు
గోడకు చేరువయ్యాయి

నేల నుండి వింగికెగిరే ఎరుపు రుమాలు
తన గుండెలపై వాలిపోయింది

వేల గొంతులలో పాట మారుమోగుతోంది
అరణ్యం మౌనంగా సెల్యూట్‌ చేసింది!!
– కెక్యూబ్‌ వర్మ, 9493436277