అనుమతి పొందిన తర్వాతనే…

– ప్రచార సామాగ్రి ముద్రించాలి
– ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీవో అంకిత్‌
నవతెలంగాణ- ములుగు
అనుమతి పొందిన తర్వాతనే ప్రచార సామాగ్రి ముద్రించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఐటీడీఏ పీవో అంకిత్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ వీడియో సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ లోకల్‌ బాడీ డిఎస్‌ వెంకన్నతో కలసి ఎన్నికల ప్రక్రియలో బాగంగా ప్రచారం కొరకు ముద్రించే కరప త్రాలు, పోస్టర్స్‌ తదితర అంశాలలో తీసుకోవా ల్సిన అనుమతులపై ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వా హకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రింటింగ్‌ చేయించే ప్రచార సామాగ్రి, ఫ్లెక్సీలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నేతృత్వంలోని మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ ద్వారా ముందస్తు అనుమతి పొందాలని అన్నారు. ప్రచురించే ప్రచార సామాగ్రి ప్రింటింగ్‌ ప్రెస్‌ పేరు, చిరునామా, సెల్‌ నెంబర్‌, ప్రచురణల సంఖ్య, ప్రచురించే అభ్యర్థి పేరు, చిరునామా వివరాలు తప్పని సరిగా అట్టి ప్రచార సామాగ్రి పై ప్రచురించాలని తెలిపారు. ప్రచురించవలసిన వివరాలకు సంబంధించిన మ్యాటర్‌ ను నిర్ణీత ప్రోఫార్మలలో సమర్పించా లని, అట్టి వాటిని ఎంసిఎంసి కమిటీ పరిశీ లించి 24 గంటలలోగా అనుమతించడం గాని, తిరస్కరించడం గాని జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ములుగు తహసీల్ధార్‌ విజయభాస్కర్‌, జిల్లాలోని ప్రింటింగ్‌ ప్రెస్‌, ఫ్లెక్సీ దుకాణాల యజమానులు, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం తహశీల్దార్‌ సంధ్యారాణి ఎన్నికల సిబ్బంది విజరుకుమార్‌, అనిస్‌ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.