ప్రజల కష్టాలు తీర్చేది కాంగ్రెస్ మాత్రమే.

Only Congress can solve people's problems.– ఇంటింటికి కాంగ్రెస్ గ్యారెంటీ పథకాల ప్రచారం
– మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవ తెలంగాణ మల్హర్ రావు.
ప్రజల కష్టాలు తీర్చేది కాంగ్రేస్ పార్టీ మాత్రమేని,తెలంగాణలోని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు సమగ్ర ప్రణాళిక చేసిన కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలను మంగళవారం జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు మండల కేంద్రములో ఇంటింటికి వెళ్లి వివరించారు. స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల గురించి వివరిస్తూ వారికి కరపత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేద మధ్య తరగతి ప్రజల కష్టాలు పోగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పక్క ప్రణాళిక చేసిందన్నారు.తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించిన నూతన గ్యారెంటీ పథకాల గురించి వివరిస్తూ తెలంగాణలో సొంతిల్లు లేని పేదలకు ఇంటి స్థలంతో పాటు, ఇంటి నిర్మాణం కోసం రూ. 5లక్షలు ఆర్థిక సాయంగా అందిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నామని, చేయూత పథకం ద్వారా వృద్ధుృలు, వితంతువులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా రూ. 4,000 పింఛన్ ఇస్తామన్నారు. పేదలకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ. 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ. 15,000 చెల్లిస్తామని కౌలు రౌతులకు కూడా దీన్ని వర్తింపజేస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12,000 సాయం అందిస్తామని, వరి పండించే వారికి మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇస్తామని వివరించారు. గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, ఇక మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సాయం, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. యువ వికాసం పథకం ద్వారా విద్యార్థులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వివరించినట్టు చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత 6 కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను సామాన్య నిరుపేద ప్రజలకు తప్పకుండా అందజేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని,ఆడిలారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు.