– సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
ప్రజల పక్షాన నిలబడేది ఎర్రజెండా మాత్రమేనని, అభివద్ధిని విస్మరించిన పార్టీలను ఈ ఎన్నికల్లో ఓడించాలని, నిత్యం ప్రజాసేవలో ఉండే తనను గెలిపించాలని నల్లగొండ నియోజక వర్గ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం కనగల్ మండల ఎక్స్ రోడ్డు, కనగల్ గ్రామం తోపాటు తిమ్మనగూడెం, తేలకంటి గూడెం, లింగోటం, మాదారం, ఇరుగంటిపల్లి, చెట్ల చెన్నారం తదితర గ్రామాలలో విశతంగా ప్రచార నిర్వహించి మాట్లాడారు. వందలాది మంది పేదలు ఇంటి స్థలాలు లేక సొంత ఇంటి నిర్మాణం కలగానే మిగిలిపోయిందని అన్నారు. గ్రామాలలో సరైన రోడ్డు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ పార్టీ కూడా పేద ప్రజలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే అది ఎర్ర జెండా తోనే సాధ్యమన్నారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులను ఇవ్వాలని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఆశాలకు కనీస వేతనం చెల్లించాలని ఇలా అనేక సందర్భాలలో రైతులు, పేద ప్రజలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన పోరాటాలు చేసి చరిత్ర కేవలం సిపిఎంకే ఉందని ఆ ఘనత ఎర్రజెండాకే దక్కుతుందన్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కందుల సైదులు, మండల కమిటీ సభ్యులు కానుగ లింగస్వామి, అక్రమ్, సుల్తానా, మారయ్య, బ్రహ్మానందరెడ్డి, లింగయ్య, పిఎన్ఆర్ శంకర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాములు, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.