ఊరడమ్మ పండగ ఘనంగా నిర్వహించాలి

నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో త్వరలో నిర్వహించనున్న ఊరడమ్మ పండగ ఘనంగా నిర్వహించాలని గ్రామ కుల పెద్దలు సోమవారం గ్రామ సచివాలయంలో పట్టణ సర్పంచ్ వేణు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వేణు మాట్లాడుతూ అందరి సహకారంతో పండగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అన్ని కులస్తుల పెద్దలు పూర్తి సహకారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరేష్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కుల సంఘ పెద్దలు పాల్గొన్నారు.