గచ్చిబౌలిలో బే విండో గ్యాలరీ ప్రారంభం

గచ్చిబౌలిలోని గ్యాలరీతో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన బే విండో
గచ్చిబౌలిలోని గ్యాలరీతో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన బే విండో

నవతెలంగాణ హైదరాబాద్: భారతీయ ఫర్నిచర్, గృహాలంకరణలో విప్లవాత్మక  బ్రాండ్ అయిన బే విండో, హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తమ  గ్యాలరీని అట్టహాసంగా ప్రారంభించటంతో హోమ్ డెకర్ పరిశ్రమను మార్చడానికి సిద్ధంగా ఉంది. ఈ 6,000 చదరపు అడుగుల గ్యాలరీ జూబ్లీ హిల్స్‌లో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వారి ఫ్లాగ్‌షిప్ స్టోర్ విజయాన్ని అనుసరిస్తుంది.  హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తలు సిద్ధాంత్ ఆనంద్ మరియు శివాని ఆనంద్‌లచే స్థాపించబడిన బే విండో, గృహ-అలంకరణ విభాగంలో  అంతరాలను పరిష్కరిస్తూ, గృహాల కోసం సరైన మిడ్ -లగ్జరీ జీవనశైలిని క్యూరేట్ చేయడానికి అంకితం చేయబడింది. గచ్చిబౌలి గ్యాలరీ వారి లక్ష్యం లో భాగంగా గణనీయమైన విస్తరణను సూచిస్తుంది, వివేకవంతులైన  కస్టమర్‌లకు మరింత విస్తృతమైన గృహాలంకరణ పరిష్కారాలను అందిస్తుంది.

బే విండో కేవలం సౌందర్యానికి అతీతంగా ఉంటుంది, నాణ్యత లేదా స్థోమతపై రాజీ పడకుండా సౌకర్యం, శైలి మరియు కార్యాచరణ యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది. ఈ రంగంలో అనుభవజ్ఞులైన నిపుణుల కుటుంబం – ఖజానా గ్రూప్ నుండి వచ్చిన ఈ  బ్రాండ్ వ్యక్తిగత అభిరుచులు మరియు జీవనశైలిని ప్రతిబింబించే ప్రదేశాలను రూపొందించడానికి కృషి చేస్తుంది.


ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డిజైనర్లతో సహకరిస్తూ, విభిన్న సంస్కృతుల నుండి ప్రేరణ పొందుతూ, బే విండో వివిధ రకాల అభిరుచులు మరియు ప్రాధాన్యతలను అందించే కలెక్షన్ల ను అందిస్తుంది. గచ్చిబౌలిలోని గ్యాలరీ ఈ ప్రత్యేకమైన ఆఫర్‌లను అన్వేషించడానికి మరియు కనుగొనడానికి కస్టమర్‌లకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది.
సిద్ధాంత్ ఆనంద్ మాట్లాడుతూ , “రాబోయే 3 సంవత్సరాలలో 10 ప్రధాన నగరాల్లో విస్తరించడానికి మేము ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను కలిగి ఉన్నాము. మా గ్యాలరీ ఫార్మాట్‌తో హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి విస్తరించడం అనేది మా జూబ్లీహిల్స్ లొకేషన్ యొక్క విజయంపై ఆధారపడిన వ్యూహాత్మక ఎంపిక” అని అన్నారు.  తమ ఇంటి ప్రాంగణాలలో  సరికొత్త  అర్థాన్ని వెదుక్కొనే వారికి, తమతో మెరుగ్గా సంబంధం కలిగి ఉండటంలో సహాయపడుతూ, ప్రతి వస్తువు  వెనుక ఒక  వినూత్న ఆలోచన  ఉండాలనుకునే వారికి అనువైనది బే విండో. ఇది  బాహ్య & అంతర్గత ప్రపంచాల సమ్మేళనం గా ఉంటూ  మిమ్మల్ని ప్రతిబింబించే ప్రాంగణాలతో  మీకు సేవ చేస్తుంది.