అక్టోబర్ 27-29 తేదీల్లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో‌ ఎడిషన్

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ)
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ)
నవతెలంగాణ హైదరాబాద్: డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) సహ-హోస్ట్ చేయనున్న ఆసియా ప్రీమియర్ డిజిటల్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ఏడో ఎడిషన్ న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అక్టోబరు 27 నుంచి 29వ తేదీ వరకు జరగనుంది. ‘గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్’ థీమ్‌తో ఇది నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఐఎంసీ- 2023 ఈవెంట్‌లో దాదాపు లక్ష మంది పైగా పార్టిసిపెంట్‌లు, ఐదు వేలకు పైగా సీఎక్స్ వో స్థాయి ప్రతినిధులు, 350 పైగా స్పీకర్లు, 400 పైగా ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. ఈ ఏడాది కీలకమైన ప్రోగ్రామ్‌లు 6జీ, 5జీ నెట్‌వర్క్‌లలో పురోగతి, టెలికమ్యూనికేషన్స్, ఇతర డొమైన్‌లలో ఏఐ పెరుగుతున్న వినియోగం, ఎడ్జ్ కంప్యూటింగ్, ఇండస్ట్రీ 4.0, ఇండియా స్టాక్ ఆవిర్భావంపై దృష్టి సారిస్తుంది. ఐఎంసీ 2023 బ్రాడ్‌కాస్ట్, సాట్-కామ్, తయారీ, సెమీకండక్టర్స్ వంటి సాంకేతిక డొమైన్‌లకు ఎల్సినా, ఐఈఎస్‌ఎ, ఐఎస్‌పిఎ, డిఎఫ్‌ఐ, ఇతర వివిధ సంఘాలతో భాగస్వామ్యం ద్వారా విస్తరిస్తుంది. బీ2జీ & బీ2బీ ఫోరమ్‌లు ఇండస్ట్రీ రౌండ్ టేబుల్స్, బిగ్ యూనివర్శిటీ, స్టూడెంట్ ఎంగేజ్‌మెంట్, గ్లోబల్ బయ్యర్ ఫోరమ్‌లను కూడా పరిచయం చేయాలని ప్లాన్ చేసింది.
          ఈ సందర్భంగా సీవోఏఐ చైర్మన్ పీకే మిట్టల్ మాట్లాడుతూ ఈ ఏడాది ఆసియాలోనే అతిపెద్ద టెలికాం ఈవెంట్ భారత్లో జరగనుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ పరిశ్రమకు ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ‌డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అదనపు కార్యదర్శి వీఎల్  కాంతరావు మాట్లాడుతూ ఐఎంసీ అనేది పరిశ్రమకు, ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అన్నారు. అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ మాట్లాడుతూ గత కొన్ని ఏండ్లుగా భారతదేశంలో టెలికాం పరిశ్రమ చాలా రూపాంతరం చెందిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్, 5జీ రోల్‌అవుట్, 6జీ కోసం రోడ్‌మ్యాప్‌తో సహా టెలికాం రంగంలో దేశం వివిధ అంశాలలో అభివృద్ధి చెందిందన్నారు. ఈ ఏడాది ఐఎంసీ వద్ద 5జీ దేశాన్ని ఎలా మారుస్తుందో చూపించడానికి వ్యవసాయం, విద్య, లాజిస్టిక్స్, రవాణా మొదలైన వాటిలో ఉపయోగపడే వినియోగ కేసులు రావాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
         ఈ సందర్భంగా కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఇండియా మొబైల్ కాంగ్రెస్ దేశంలో ప్రధాన సాంకేతిక కార్యక్రమంగా అవతరించిందన్నారు. గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5జీని ప్రారంభించారన్నారు. భారతదేశం అత్యంత వేగవంతమైన 5జీ రోల్‌అవుట్‌తో దేశంగా అవతరించిందన్నారు. తక్కువ వ్యవధిలో దాదాపు 2.75 లక్షల బీటీఎస్ 5జీని ప్రసరింపజేస్తోందని తెలిపారు. భారతదేశాన్ని టెక్నాలజీ డెవలపర్, టెలికాం తయారీదారు, ఎగుమతిదారుగా నిలబెట్టాలనుకుంటున్నామని పేర్కొన్నారు.
Spread the love