పొలిటికల్‌ భేటీలపై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు

నవతెలంగాణ – కర్ణాటక: పొలిటికల్‌ భేటీల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్‌ను విపక్షాలు తమ భాగస్వామిగా భావించడం లేనట్లుంది.. అందుకే తాను విపక్షాల మహాకూటమిలో చేరే ప్రసక్తి లేదని అన్నారు. ఇక, ఇదే టైంలో ఎన్డీయే కూటమి సమావేశంపై కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఎన్డీయే నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం రాలేదు.. ఆ ఫ్రంట్‌ ఎలా ఉంటుందో చూద్దామంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

Spread the love