సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఉండవల్లి: భారత కాటన్‌ సంస్థద్వారా పత్తి పండించిన రైతు నుంచి నేరుగా సెంట్రల్‌ ప్రభుత్వమే గిట్టుబాటు ధరతో కొను గోలు చేస్తున్నట్లు గద్వాల జిల్లా మార్కెటింగ్‌ అధికారి పుష్పవతమ్మ తెలిపారు. గురువారం మండలంలోని శ్రీ వరసిద్ధి కాటన్‌ మిల్లు లో సీసీఐ ద్వారా నాణ్యతమైన పత్తికి 7 వేల ఇరవై రూపాయలు గిట్టుబాటు ధరతో 8 శాతం తేమ పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు జిల్లా అధికారి తెలిపారు. రైతులు నాణ్యతమైన పత్తిని తీసుకొని వచ్చి వ్యవసాయ అధికారి ధ్రువీకరణ పత్రంతో ఆధార్‌ కార్డు బ్యాంకు ఖాతా బుక్‌ పాస్‌ వంటివి తప్పనిసరిగా తీసుకుని రావాలని కోరారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా సీసీఐ ద్వారా కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకుని వ్యవసాయ అధికారి అంగీకార పత్రం ద్వారా కేంద్రానికి పత్తి తీసుకొని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్‌ వన్‌ సెక్రెటరీ నరసింహులు సీసీఐ అధికారులు అలంపూర్‌ చౌరస్తా మార్కెట్‌ సెక్రెటరీ ఎల్ల స్వామి , ఆపరేటర్‌ శరత్‌ కుమార్‌ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.