ఎన్సీపి కార్యాలయం ప్రారంభం..

– రాష్ట్ర అధ్యక్షులు సునీల్ జాదవ్..
నవతెలంగాణ-డిచ్ పల్లి : నిజామాబాద్ రూరల్ నుండి గిరిజన నాయకుడు శివరామ్ మహారాజ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించామని, దానిలో భాగంగానే ఇందల్ వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద ఎన్సీపి కార్యాలయం ప్రారంభించినట్లు ఎన్సీపి రాష్ట్ర అధ్యక్షులు సునీల్ జాదవ్ అన్నారు.సోమవారం సాయంత్రం ఎన్సీపి కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం గిరిజనులు అదిక సంఖ్యలో ఉన్నారని,ఇదే కాకుండా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు దివించి మండల వాసైన శివరామ్ మహారాజ్ గడియారం గుర్తుకు ఓటు వేసి శివరామ్ మహారాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు కరపత్రాలను ఆవిష్కరించారు.