– ముఖ్య కార్యకర్తల సమావేశంలో గువ్వల బాలరాజు
నవతెలంగాణ – ఉప్పునుంతల
ముఖ్య కార్యకర్తల సమావేశంలో శుక్రవారం పాల్గొని పార్టీకి కొండంత ధైర్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. ఉప్పునుంతల మండల కేంద్రంలో 30 పడకల నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించుకున్నట్లు వివరించారు. ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రాజెక్టులకు సహకరించాలనీ, కాళ్ళలో కట్టలు పెట్టరాదని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అపర భగీరథుడు, దశాబ్దాల కలను సాకారం చేసి బంగారు తెలంగాణకు బాటలు వేసి దేశమే తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా అభివద్ధికి శ్రీకారం చుట్టిన మహానేత సిఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఇక్కడి నాయకులు వారి స్వలాభం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేసి దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, ఛైర్మెన్ సత్తు భూపాల్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు కొత్త రవీందర్ రావు, పాలశీతలీకరణ ఛైర్మెన్ కట్టా గోపాల్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాలు నాయక్, టౌన్ అధ్యక్షులు శ్రీను ముదిరాజ్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.