జిల్లాకు చేరుకున్నసాధారణ పరిశీలకులు

 – స్వాగతం పలికిన జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్, ఎస్పీ అపూర్వరావు
 నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్గొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల కోసం  భారత ఎన్నికల కమిషన్  నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు జిల్లాకు చేరుకున్నారు.  86- దేవరకొండ(ఎస్.టి), 87-నాగార్జున సాగర్ నియోజకవర్గాలకు సంబంధించి సాధారణ పరిశీలకులు అర్ కన్నన్, 88 – మిర్యాలగూడ,92- నల్గొండ నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులు అవినాష్ చంపా వత్, 93-మును గోడ్,95- నకిరేకల్ నియోజకవర్గాలకు కె.బాల సుబ్రహ్మణ్యం,ఐఏఎస్ లను సాధారణ పరిశీలకులు గా ఎన్నికల కమిషన్ నియమించింది. కేంద్ర సాధారణ పరిశీలకులు అవినాష్ చంపావత్, కె.బాల సుబ్రహ్మణ్యం, పోలీస్ పరిశీలకులు వినీత్ ఖన్నా, లకు  ఎలక్ట్రిసిటీ అతిథి గృహం లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అర్వి.కర్ణన్, ఎస్.పి.అపూర్వ రావు లు పుష్ప గుచ్చం అంద చేసి ఘనంగా స్వాగతం  పలికారు.అనంతరం రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలో  చేపట్టిన ఏర్పాట్లు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ వారికి వివరించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనల ఫిర్యాదుల పై సంప్రదించవచ్చు..
అసెంబ్లీ సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, ఫిర్యాదులు ఏవైన ఉన్నట్లైతే తెలియజేయాలని కేంద్ర సాధారణ  పరిశీలకులు కె.బాల సుబ్రహ్మణ్యం  తెలిపారు.
 మును గోడ్,నకిరేకల్ నియోజక వర్గాలకు సంబంధించి సాధారణ ఎన్నికల పరిశీలకులు కె.బాల సుబ్రహ్మణ్యం, మొబైల్ నంబర్ 8143880655, లైజన్ అధికారి కె.శ్రీనివాసులు నంబర్ 9948095101 లో అందు బాటు లో ఉంటారు.మిర్యాలగూడ,నల్గొండ నియోజకవర్గాలకు సంబందించి సాధారణ పరిశీలకులు అవినాష్ చంపావత్, మొబైల్ నంబర్ 8143550654, లైజన్ అధికారి యాకూబ్ అలీ నంబర్ 7036771554 లో, దేవరకొండ,నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించి సాధారణ పరిశీలకులు అర్.కన్నన్, మొబైల్ నంబర్ 8712200653, లైజన్ అధికారి సయ్యద్ జిలానీ నంబర్ 8501061615  లలో  అందుబాటు లో ఉంటారు. ఎవరైనా ఫిర్యాదు చేయదలచిన వారు స్వయంగా గాని లేదా ఫోన్ ద్వారా గాని ఫిర్యాదులు చేయవచ్చని  వారు తెలిపారు.