ప్రెసిడెన్సి పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు..

నవతెలంగాణ -మోపాల్

మోపాల్ మండల శివారులో గల ప్రెసిడెన్సీ ఉన్నత పాఠశాలలో బుధవారం రోజున శీను నాయక్ దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచితంగా ఆరు నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు  వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వారి వారి సమస్యలను తెలుసుకొని వారి కనుగుణంగా వైద్యం అందించి అలాగే ఉచిత మందులు కూడా ఇవ్వడం జరిగింది, డాక్టర్ శీను నాయక్ మాట్లాడుతూ దంత సంరక్షణ గురించి విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన వివరించారు అలాగే  దంత క్షయం అనేది దీర్ఘకాలిక వ్యాధి ఒకసారి వ్యాధి వస్తే జీవితాంతం కొనసాగుతుందని దీని త్వరగా చికిత్స అవసరమని తెలియజేశారు దంత సమస్యయే అని తేలికగా తీసుకోవద్దని అది కొద్ది కొద్దిగా పెరిగి పెద్దది అవుతుందని అటువంటి దాన్ని ఆదిలోనే   వైద్యంతో చికిత్స చేసుకొని దానిని కట్టడి చేయాలని ఆయన తెలిపారు. అలాగే తమ పాఠశాలల పిల్లల కోసం ఇంత శ్రద్ధ తీసుకుంటున్న కళాశాల చైర్మన్ శ్రీమంత రెడ్డి మరియు ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ డి మహేష్ మరియు దంత వైద్యులు డాక్టర్ సంజయ్, డాక్టర్ మౌనిక, మేనేజర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.