హోంగార్డులను క్రమబద్ధీకరించండి

– సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
హోంగార్డులను శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. వారి సేవలను గుర్తించడంతోపాటు సకాలంలో వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఈమేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఇతర పోలీసులతో సమానంగా వారు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.
విధి నిర్వాహణలో మరణించిన కుటుంబాలకు కారుణ్య నియామక అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కానిస్టేబుళ్లు పొందుతున్న రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఏవీ కూడా హోంగార్డులకు వర్తించడం లేదని తెలిపారు. దీంతో పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. వేతన సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రత్యేకంగా రూ. 10 లక్షలు ఇవ్వాలనీ, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.