పానుగంటి సతీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

నవతెలంగాణ – డిచ్ పల్లి: నిజామాబాద్ జిల్లా బిజెవైఎం కార్యదర్శి పానుగంటి సతీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం డిచ్ పల్లి మండలం లోని సుద్దపల్లి గ్రామం లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.పలువురు యువకులు ముందుకు వచ్చి తమవంతుగా,బిజెవైఎం నాయకులు, సర్పంచ్ పానుగంటి రూపా భర్త పానుగంటి సతీష్ రెడ్డి జన్మదినం ను పురస్కరించుకుని రక్తదానం చేశారు.వారందరికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ బిజెపి ఇంఛార్జి కులచారి దినేష్ కుమార్ ,ఎంపీపీ గద్దె భుమన్న, ఎంపిటిసి ఎంబడి సంతోషం, రెడ్ క్రాస్ సొసైటీ డిచ్ పల్లి చైర్మెన్ డాక్టర్ రవి వర్మ, నిజామాబాద్ రూరల్ మండలం అధ్యక్షుడు మూల జగన్ రెడ్డి, సీనియర్ నాయకులు సాంపల్లి గంగారెడ్డి, నరహరి,వినోద్ రెడ్డి క్రాంతి, భూషణ్ లక్ష్మణ్ నాయకులు పాల్గొన్నారు.