
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉస్మానియా వైద్య కళాశాలలో హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ రెడ్డి, అధ్యాపక బృందం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ప్రిన్సిపాల్ శశికళ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మానవ మనుగడకు మొక్కలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా కళాశాలలో పచ్చదనం పరిశుభ్రతకు ముఖ్య ప్రాధాన్యమిస్తూ, అధ్యాపక బృందం విద్యార్థులచే ప్రతి ఏటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చేపట్టిన హరితహారం ఎంతో మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి భావితరాల మనుగడకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ జయ, డాక్టర్ కిరణ్మయి, ఆచార్యులు డాక్టర్ జానకి, డాక్టర్ సుమలత, డాక్టర్ పద్మావతి, డాక్టర్ కవిత, ఎం పి హెచ్ ఓ లు వేణుగోపాల్ గౌడ్, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.