ఓటే వజ్రాయుధం

భారత రాజ్యాంగం
సర్వ మానవాళికి ఓటు హక్కు
కల్పించడం గొప్ప అవకాశం

గన్ను- పెన్ను కన్న బలమైనది ఓటు
ఓటు వేసే ముందు ఒక ఇంత ఆలోచించు
ఒనరు-నెనరుతొ ఒడిసిపట్టి
సరైన వ్యక్తికి ఓటు వేద్దాం

నేడు కుటుంబ పాలనకు పట్టం కడుతున్నారు
వర్గ రాజకీయంతో వల విసురుతున్నారు
వలలో చిక్కిన చేపల కాకుండా
వల విసిరే చేయిని పసిగట్టి
ఓటు అనే వజ్రాయుధంతో సమాధానం ఇద్దాం

పూటకో పార్టీ మార్చే నాయకులు
స్వార్థంతో అధికార దాహంకై ఆరాటపడుతున్నారు
గెలిపే ముఖ్యమని ప్రజల శ్రేయస్సు మరుస్తున్నారు

ఇక చెల్ల వ్‌ ఈ కథలు
పనిచేసే వాడికే పట్టాభిషేకం

– ఆర్కల రాజేష్‌, 9177909700