చిగురాకుల చిగురులా
చిరునవ్వుల్ని విరబూస్తూనే
పసిడి కలలకు జన్మనిచ్చేది
ఏ గడ్డ మట్టిని నిమిరినా
సస్యశ్యామలమగు పరిమళాన్ని
నలువైపులా వెదజల్లేది
మన నేలమ్మ ముంగిట్లో
ప్రకతి పురివిప్పి ఆడుతూనే
చెట్టు చేమల కొమ్మల్తో
అనునిత్యం స్వాగతం పలికేది
ఏ రుతువు పలకరించినా
ఆప్యాయంగా ఆస్వాదిస్తూనే
ఆ పలుకులతో జతకట్టేది
తారతమ్యాల దారాలు తెంపుతూ
సమసమాజపు ధోరణిలో
మానవత్వంగా అడుగులేసేది
పాడి పంటల పచ్చదనపు జెండాని
రైతు మాగానిపై రెపరెపలాడిస్తూ
నేలమ్మ మురిసిపోతుంది
మన నేలమ్మ
కరిగిపోని సిరికి ఊతమైతాది
బాధ్యతకు గురుతైతాది
సహనానికి మారుపేరౌతాది
– నరెద్దుల రాజారెడ్డి,
9666016636