భాష ఓ పట్టుకొమ్మ
ఒడుపు, ఎగబ్రాకడం,
ఫలితం అంతా.. అంతా.. సాధకుడి కృషే !
భాష ఓ అమ్మత కలశం తృప్తి తాంబూలం
అమ్మ ప్రేమలా మధురం
భాష ఓ అక్షయ పాత్ర
అక్షరాలు యాభై ఆరే ఉద్భవించే పదాలు కోట్లు!
భాష ఓ తరగని సిరి
నిత్యం.. అనునిత్యం దొరికే సంతోషం
భాష ఓ గుప్తనిధి
శోధన, గురువు తోడుంటే
భవిష్యత్తు మార్గదర్శికమే!
భాష ఓ తీరని దాహం
ఎంత తీర్చుకున్నా మిగిలే
ఓ విజ్ఞాన భాండాగారం
ఎన్ని భాషలున్నా మాతృ భాషపై మక్కువ మిన్న
మన భాష తెలుగు! జీవితాలకే వెలుగు
చాటరా తెలుగోడా!
– యలమర్తి అనూరాధ, 9247260206