
– మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
నవతెలంగాణ- మల్హర్ రావు: మంథని నియోజకవర్గ ప్రజలకే మా జీవితాలు అంకితం చేశామని, ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా సోమవారం మంథని మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు రజక, మంగలివాడ, ఉస్మాన్‌పూర్, విశ్వాబ్రాహ్మణవీధి, భగత్‌నగర్‌లలో వార్డు కౌన్సిలర్ గర్రెపల్లి సత్యం ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ గారిని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృధ్ది జరిగిందన్నారు. అంతేకాకుండా అనేక సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందించామని గుర్తు చేశారు.