స్పీకర్ కే మా మద్దతు

నవతెలంగాణ- కోటగిరి: కోటగిరి ఉమ్మడి మండలంలోని గౌడ సంఘ సభ్యులు శుక్రవారం బాన్సువాడలోని పోచారం శ్రీనివాస్ రెడ్డి గృహంలో రాబోయే ఎన్నికలలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాన్ని అందజేశారు సంఘ అభివృద్ధికి నిరంతరము కృషి చేసిన నాయకులు పోచారం అని గౌడ సంఘ నాయకులు గంగాధర గౌడ్ పేర్కొన్నారు గౌడ సంఘ నాయకులు కాశా గౌడ్, సురేష్ గౌడ్, అరుణ్ కుమార్ గౌడ్, గంగా ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు