
మేము సాగు చేసుకున్న పోడు భూములు మాకే చెందాలని మండలంలోని పసర గ్రామం రైతులు అంటున్నారు. మంగళవారం రైతులు తమ తోడు సమస్యను మీడియాతో విన్నవించుకున్నారు. ములుగు జిల్లా గోవిందపేట మండల పసర గ్రామ అభ్యుదయ కాలనీ వాసులం మేము 1998వ సంవత్సరం నుండి -2005వసంవత్సరం వరకు రాంపూర్ శివారులో పోడు భూముల్లో దాదాపు 30 కుటుంబాల సభ్యులం వ్యవసాయం చేస్తూ జీవనం సాగించు చున్నాము, మొదట మాకు పాలకవర్గం నుండి గాని ఫారెస్ట్ అధికారుల నుండి గాని రెవిన్యూ నుండి గాని ఎలాంటి ఇబ్బందులు రాలేదు, కానీ 2005వ సంవత్సరంలో ఫారెస్ట్ అధికారులు ఆనాటి పాలకవర్గం మా మీద కేసులు పెట్టి చిన్న పెద్దా తేడా లేకుండ 80 ఏండ్ల ముసలి వాళ్లనుండి పిల్ల తల్లులు అని చూడకుండ మమ్ముల అందరిని జైలుకు పంపించడం జరిగింది ,చాలా సంవత్సరాలు కోర్టుకు తిరగడం జరిగింది, కోర్టు లో ప్రభుత్వం ఓడిపోయింది.అయిన కూడ మమ్ముల జైలులో ఉంచి మమ్ముల వదిలి పెట్టకుండ ప్రభుత్వం అటవీ అధికారులతో కలిసి మొక్కలు నాటటం జరిగింది. అయిన కూడా ప్రభుత్వం తో పోరాటం చేస్తూ 2008వ సంవత్సరం వరకు వ్యవసాయం చేసాం. కానీ సెంట్ భూమి కూడ లేకుండ మేము మా తాతల కాలం నుండి ఇక్కడే జీవిస్తున్నాం . మాకు కానీ మా పిల్లలకి గాని ఎలాంటి జీవనాధారం లేకపోడం బాధాకరం ప్రక్క రాష్ట్రం నుండి వచ్చిన గుత్తి కోయలకు యితర గిరిజనులకు నేటి ప్రభుత్వం పట్టాలిచ్చారు మాకు ఎలాంటి అభ్యయంతరం లేదు, కాని 90 శాతం కంటె ఎక్కువ జనాభా ఉన్న గిరిజనేతరులకు నేటి పాలక ప్రభుత్వం ఒక పట్టా కూడా ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం అని అనంత్ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు.కాబట్టి ములుగు ఏజెన్సీ ఎరియ లో ఉన్న గిరిజనేతరుల మైన మేము దున్నుకొని సాగుచేసుకున్న మా మొత్తం పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవాళ్ళని కోరుతున్నాం. టిడిపి రాష్ట్ర నాయకులు యానాల అనంత్ రెడ్డి , లేని యెడల ములుగు ఏజెన్సీ ఎరియా లో ఉన్న గిరిజనేతరుల తో కలసి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున దర్నాలు నిర్వహిస్తామని,త్వరలో ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని యానాల అనంత్ రెడ్డి ప్రభుత్వంమును హెచ్చరించారు. మా గిరిజనేతరుల కోరకు ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతంలో ఏలాంటి జి ఓ లు కూడ లేవు.మా బ్రతుకులు దారం తెగిన గాలి పటం లాగ ఉన్నవి అని అనంత్ రెడ్డి తన భాధను వెళ్ల పెట్టారు. మమ్లను ఓటు అడిగే హక్కును ఈ ప్రభుత్వం కోల్పోయిందని, మా గిరిజనేతరులకు పట్టాలు ఇవాళ్ళని లేని యెడల ఓటు వేయకుండ బహిష్కరిస్తామని, ప్రభుత్వఆనీ హెచ్చరించారు.