– జిల్లాలకు కేటాయించాలి : ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద 2021, జనవరిలో తెచ్చిన 317 జీవో అమలు చేయడం వల్ల చాలా మంది ఉపాధ్యాయులు వారి స్థానికతను కోల్పోయి వివిధ జిల్లాలకు కేటాయించబడ్డారని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే భార్యాభర్తలైన ఉద్యోగులు ఒక్కొక్కరూ ఒక్కో జిల్లాకు వెళ్లారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనివల్ల కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని నష్టపోయిన ఉపాధ్యాయులను వారి స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన స్పౌజ్ టీచర్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు.