మినిమం వేజ్‌బోర్డ్‌ చైర్మెన్‌గా పీ నారాయణ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహాసంఘం (మినిమం వేజెస్‌ అడ్వయిజరీ బోర్డ్‌) చైర్మెన్‌గా పీ నారాయణ నియమితులయ్యారు. ఆయన్ని చైర్మెన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.