నవతెలంగాణ జక్రాన్ పల్లి
చలో కోరుట్ల కార్యక్రమానికి మండలంలోని పద్మశాలీలు ఆదివారం తరలి వెళ్లారు. చలో కోరుట్ల కార్యక్రమానికి జక్రాన్ పల్లి మండలంలోని అన్ని గ్రామాల పద్మశాలీలు తరలి వెళుతున్నట్లు మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ ఆదివారం తెలిపారు. కోరుట్లలో నిర్వహిస్తున్న పద్మశాలీల రాజకీయ యుద్ధ బెరికి అన్ని గ్రామాల నుంచి వాహనాల ద్వారా తరలి వెళ్తున్నట్టు శ్రీపతి శేఖర్ తెలియజేశారు. కోరుట్లలో నిర్వహిస్తున్న పద్మశాల ఆత్మ గౌరవ సభకు అధిక సంఖ్యలో పద్మశాలీలు తరలి వెళ్తున్నట్లు శ్రీపతి శేఖర్ పేర్కొన్నారు.