యుద్ధభేరీకి బయలుదేరిన పద్మశాలీలు

నవతెలంగాణ- నవీపేట్: పద్మశాలీల యుద్ధభేరి గర్జనకు చలో కోరుట్ల కార్యక్రమానికి మండల పద్మశాలీలు ఆదివారం బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర రాజకీయాలలో శాసించే దిశగా పంజా విసిరేందుకు కోరుట్లలో నిర్వహించే పద్మశాలి గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు లోకం నర్సయ్య, గంగా కిషన్, నవీన్ రాజ్, వేణు గంగాధర్, నర్సయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.