నవతెలంగాణ – రాజంపేట్
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మంగళవారం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి జడ్పిటిసి కొండా హనుమాన్లు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ… జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తున్నట్టు ప్రకటించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. కెసిఆర్ మార్గదర్శాల ప్రకారం మరింత ఉత్సాహంగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేస్తామని వారు పేర్కొన్నారు.