పాలడుగు భాస్కర్‌ను గెలిపించాలి

నవతెలంగాణ-మధిర
మధిర నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పాలడుగు భాస్కర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఐటీయు అఖిల భారత కోశాధికారి మందడపు సాయిబాబు కోరారు. మంగళవారం మధిర బోడిపూడి భవన్‌ నందు జనరల్‌ బాడీ సమావేశాన్ని పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐటియు అఖిల భారత కోశాధికారి మందడపు సాయిబాబా హాజరై ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ(ఎం) బలమేంటో చూపాలని, పలుచోట్ల పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు. 10వ తేదీన పాలడుగు నామినేషన్‌ వేయనున్నారని, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు, కార్యదర్శి మండల కార్యదర్శి మందా సైదులు, మండవ పణీంద్రకుమారి, సిఐటియు నాయకులు పడకండి మురళి, మధు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్‌, రామ నరసయ్య, తేలబ్రోలు రాధాకృష్ణ, విల్సన్‌, వాసిరెడ్డి సుందరయ్య, ఆంజనేయులు, నరసింహారావు, మీరా ఖాన్‌, సాంబశివరావు, ఫాతిమా, విజరు, రామ కిషోర్‌ పాల్గొన్నారు.
పాలడుగు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం
ముదిగొండ : మండల పరిధిలో మల్లన్నపాలెం గ్రామంలో సిపిఐ(ఎం) మధిర నియోజకవర్గ అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ విజయాన్ని కాంక్షిస్తూ సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) మండల నాయకులు టిఎస్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ఈనెల 10న మధిరలో పాలడుగు భాస్కర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి గ్రామం నుండి భారీ సంఖ్యలో తరలి రావాలన్నారు. బహిరంగసభను జయప్రదం చేయాలని టీఎస్‌ కళ్యాణ్‌ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి పరిటాల చుక్కయ్య, నాయకులు కోలేటి వెంకటేశ్వర్లు, తోట వీరబాబు, తోట నాగేశ్వరరావు, ఉపేందర్‌, పరిటాల శ్రీను, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పాలడుగు భాస్కర్‌కు మద్దతు
ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గ సిపిఐ(ఎం) అభ్యర్థిగా సిఐటియు కార్మికోద్యమ నాయకులు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌కు ముదిగొండ భవన నిర్మాణ కార్మిక సంఘం, గ్రానైట్‌ పరిశ్రమల కార్మిక సంఘం (సిఐటియ అనుబంధం) సంపూర్ణ మద్దతు తెలుపుతూ మంగళవారం ప్రచారం నిర్వహించారు. కార్మిక నేత పాలడుగు భాస్కర్‌కు ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించేందుకు కృషి చేస్తామని కార్మిక నాయకులు తెలిపారు. కార్మికుల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పరిష్కారానికి శ్రమిస్తున్న పాలడుగు భాస్కర్‌ విజయానికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఇరుకు నాగేశ్వరరావు, మండల కన్వీనర్‌ టిఎస్‌ కళ్యాణ్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శి ఈశ్వరచారి, శెట్టిపోగు వెంకటేశ్వర్లు, నాయకులు తేరాల నాగేశ్వరరావు, బంక ఉపేందర్‌, ప్రభాకర్‌, ఉపేందర్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.