పంచాయతీ కార్మికులను వేంటనే క్రమబద్ధీకరించాలి 

– కార్మికుల నిరవధిక సమ్మెకు బీఎస్పీ సంఘీభావం

నవతెలంగాణ-బెజ్జంకి 
గ్రామ పంచాయతీ కార్మికులందరిని ప్రభుత్వం వేంటనే క్రమబద్ధీకరించాలని బీఎస్పీ మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు బోనగిరి ప్రభాకర్ డిమాండ్ చేశారు.మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ అవరణం వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన 3వ రోజు నిరవధక సమ్మె శిభిరాన్ని శనివారం బీఎస్పీ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడారు. గ్రామాల పరిశుభ్రతతో పంచాయతీ కార్మికుల పాత్ర కీలకమైందని..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేసిన పల్లే ప్రగతి,ఇంటింటా చెత్త సేకరణ,గ్రామాల పారిశుధ్యంలో పంచాయతీ కార్మికులు చేసిన ఎనలేని కృషిని బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోయిందని ఎద్దేవా చేశారు.అమలు చేయలేని హామీలిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగుబలహీన వర్గాల ప్రజలను మభ్యపేడుతూ వంచిస్తుందని అగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి వేంటనే క్రమబద్ధీకరణ చేయాలని బీఎస్పీ పక్షాన డిమాండ్ చేశారు. బీఎస్పీ నాయకులు తిరుపతి, శ్రీనివాస్, పర్శయ్య, సురేశ్, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.