మహిళల కోసం మహిళా సమాన్

నవతెలంగాణ-చేర్యాల
కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ లో  మహిళల కోసం మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఖాతాను  ప్రవేశపెట్టిందని పోస్టల్ అసిస్టెంట్ సూపర్నెంట్ మూల రమాదేవి తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ లో సోమవారం నిర్వహించిన సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ మహిళలు ఈ ఖాతాలో  రెండు సంవత్సరాల కోసం  రూ.1000 నుండి రూ.2 లక్షల వరకు ఫిక్స్ డిపాజిట్ చేసుకొని 7.5 శాతం వడ్డీ పొందవచ్చని తెలిపారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఈ ఖాతాను తీసుకోవచ్చని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సబ్  పోస్ట్ మాస్టర్  దిలీప్, మెయిలోవర్స్ ఇయర్ బిక్షపతి,  బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు పాల్గొన్నారు.
Spread the love