పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయ మాసపత్రిక

ప్రధాన సంపాదకులుగా తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పీఆర్‌టీయూటీఎస్‌ అధికార మాసపత్రిక ‘పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయ’ ప్రధాన సంపాదకులుగా తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన జిల్లా అధ్యక్షకార్యదర్శుల సమావేశంలో తీర్మానం మేరకు రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పింగిలిన శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావులు నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఇన్నారెడ్డి ప్రస్తుతం మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఈ నియామకానికి సహకరించిన ఎమ్మెల్సీ కూడ రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్‌, మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పింగిలిన శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, 33జిల్లాల అధ్యక్షకార్యదర్శులకు కృతజ్ఞతలు ఆయన తెలిపారు.