క్విల్లింగ్ ఆర్ట్. ఖాళీ సమయాల్లో అద్భుతమైన కళాకృతులు చేయడానికి ఇదొక మార్గం. దీన్నే పేపర్ ఫిలిగ్రీ అనీ కూడా పిలుస్తారు. టర్కీ దేశపు ఇస్తాంబుల్ నగారానికి చెందిన ‘సెన రూన’ అనే అమ్మాయి చేతిలో రూపుదిద్దుకున్నవే ఈ కాగితపు కళారూపాలు. మొదట సరదాగా కాగితంతో బొమ్మలు చేసినా తర్వాత తనకి వచ్చిన గుర్తింపు, ప్రోత్సాహంతో చేస్తున్న ఉద్యోగం వదిలి పూర్తి స్థాయిలో ‘క్విల్లింగ్ పేపర్ ఆర్ట్’లో మునిగిపోయింది. ఇంటిని అలంకరించే ఫ్రేమ్స్, వాల్ హ్యాంగింగ్స్, ఫ్లవర్స్, పిల్లల బొమ్మలు వంటివి క్విల్లింగ్ లేదా ఫిలిగ్రీ ఆర్ట్ విధానంలో తయారు చేసి ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తోంది. ‘కాస్త సమయాన్ని వచ్చించగిగితే అందమైన కళాకృతులను తయారు చేసుకోవచ్చు.
– ఆనంద మైత్రేయమ్